న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం సమాయాత్తమౌత్తమౌతోంది భారతీయ జనతా పార్టీ. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, వనరులనూ వినియోగించుకుంటోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతోంది. మరి కొన్ని చోట్ల.. ఇదివరకే ఉన్న పొత్తులను ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తోంది. దీనికోసం నామమాత్రపు సీట్లను తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. తాజాగా పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ. మొత్తం 13 లోక్ సభ స్థానాలు ఉన్న పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ 10 చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన మూడింటిని మిత్రపక్షం బీజేపీకి కేటాయించింది. అకాళీదళ్ తో పొత్తు ఖాయమైనట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం వెల్లడించారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
No comments:
Post a Comment