….గుహాలయానికి కానుకలు
రాతిలో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం ఉండటం ఈ శిల్పంలోని ప్రత్యేకత.ఇక్కడ కొండలో రాతిని మలిచి ఈ విగ్రహాలను చెక్కారు.గర్భాలయానికి జయవిజయుల విగ్రహాలు ఉన్నాయి.
మూడవ అంతస్థులో పూర్తిగా నిర్మింపబడిన త్రికుటాలయం ఉంది.వీటిలో ఎటువంటి విగ్రహాలు లేవు.14వ శతాబ్దంలో ఇక్కడ కొండవీటి రాజులు వేసిన శాసనం ప్రకారం ఈ గుహాలయాలు మూడు లేక ఏడు శతాబ్దాలు నాటి విష్ణుకుండినుల కాలనివని క్రీ.శ 1343 లో అన్నారెడ్డి కుమారుడు పంచమి రెడ్డికి అనంత పద్మనాభునికి అనేక కానుకలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
రహాస్య మార్గాలు
ఈ ఉండవల్లి గుహాలయాలనుంచి కొండవీటీ కోటకు,మంగళగిరి కొండకు,విజయవాడ కనకదుర్గ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయని చెబుతారు.పూర్వం ఈ మార్గాల గుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తన సైన్యాలను తరలించేవారు.ఇక్కడ ఉన్న స్వరంగ మార్గం మూత పడి పుడిపోయి ఉంది.కొంతకాలం క్రితం పురావస్తు శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు పురాతన బౌద్ధ శిల్పాలు బయట పడ్డాయి.ఒకప్పుడు ఈ కొండ పై బౌద్ధాలయాలు ఉన్నాయని చెబుతారు.విజయవాడకు రెండు కిలో మీటర్లు ఉన్న ఈ గుహాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉన్నాయి.విజయవాడ,గుంటూరు జిల్లాల నుంచి ఇక్కడికి బస్సు లేదా ఆటో సౌకర్యం ఉంటుంది.ఇలాంటి అపురూప కళాఖండాలు చరిత్రలో కనుమరుగు కాకుండా చూడవల్సిన బాధ్యత ప్రభుత్వానిది.దీనిలో మనపాత్ర కుడా చాలా అవసరం.ప్రభుత్వం ఈ మధ్య కొంత ఆసక్తిని చూపించి పర్యాటకులకు తెలిసేలా మార్గాలలో కొన్ని బోర్డులను పెట్టించింది.

No comments:
Post a Comment