అల్లూరు న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు:
- టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్…
- నెలకు రూ.4 వేలు ఇవ్వడం వల్ల జీవనం కష్టంగా ..
- చెన్నై నుంచి వచ్చే పెద్దబోట్ల వల్ల మా వలలకు ఇబ్బందిగా ఉందని..
చేపల వేట నిషేధ కాలంలో రెండు నెలల పాటు ప్రభుత్వం మత్స్యకారులకు అందిస్తున్న జీవన భృతిని రూ.10 వేలకు పెంచాలని మత్స్య, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి బి.శ్రీధర్‌ను మత్స్యకారులు కోరారు. కోస్తా తీర ప్రాంతంలో పల్లెకారులందరూ చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నామని.. నెలకు రూ.4 వేలు ఇవ్వడం వల్ల జీవనం కష్టంగా మారిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు రవీంద్రనాథ్‌ఠాగూర్, మత్స్యశాఖ జేడీ బలరాం, సహాయ సంచాలకులు నాగభూషణం, చంద్రశేఖర్, ఎంపీడీవో సుజాత, పంచాయతీ కార్యదర్శి సురేష్ ఉన్నారు.

No comments:
Post a Comment