Thursday, February 28, 2019

ఓటర్లును తికమక చేస్తున్నారు…

ప్రకాశం న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు:
  • టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్ .
  • రెండు రోజులు… వేల అర్జీలు…
  • గట్టి చర్యలతోనే అడ్డుకట్ట…
  • క్షేత్రస్థాయిలో చాలామంది చిరునామాలు దొరకని పరిస్థితి. ..
నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు రెండు రోజుల వ్యవధిలో 5,200 దరఖాస్తులు వచ్చాయి. మార్టూరు మండలం నుంచి అత్యధికంగా 1,723 అర్జీలు, ఇంకొల్లు మండలం నుంచి 1,116 వచ్చాయి.ఓటరు జాబితాలపై సైబర్‌ నేరగాళ్లు దృష్టి పెట్టారు.  చీరాల నియోజకవర్గంలోనూ ఇదే విధంగా దాదాపు 2,500 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌ వేదికగా సైబర్‌ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. వారి వెనుక ఉన్నదెవరు అన్న విషయమై లోతైన దర్యాప్తు చేసి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఎంపిక చేసిన వారి ఓట్లను తొలగించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఇంకొల్లులో గురువారం సర్వే చేస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

No comments:

Post a Comment