Wednesday, February 27, 2019

క్రికెటర్ జయసూర్యపై రెండేళ్ల నిషేధం…


న్యూస్‌టుడే:
  • శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్‌ జయసూర్య రెండేళ్లపాటు నిషేధానికి గురయ్యాడు.
  • మంగళవారం ఐసీసీ ఈమే రకు ఒక ప్రకటన చేసింది.
శ్రీలంక క్రికెట్‌ బోర్డులో అవినీతి కుంభకోణం 2017లో బయటపడింది. ఏప్రిల్‌ 2016 నుంచి ఆగస్ట్‌ 2017వరకు శ్రీలంక క్రికెట్‌ సెలెక్షన్‌ బోర్డు ఛైర్మన్‌గా జయసూర్య ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జయసూర్య ఉపయోగిం చిన మొబైల్‌ ఫోన్లను సమర్పించాలని ఆదేశించింది. తొలుత తన వద్ద రెండు మైబైల్స్‌ ఉన్నాయని చెప్పిన జయసూర్య అనంతరం మరో రెండు మైబైల్స్‌ కూడా ఉండేవని..అవి పోయాయని ఐసీసీకి తెలిపాడు. విచారణలో జయసూర్య ఒక మొబైల్‌ను ధ్వంసం చేశాడని తేలింది. జయసూర్య న్యాయవాది కేసు విచారణ సాగుతున్న సమయంలో సాక్ష్యంగా ఉన్న మొబైల్‌ను ధ్వంసం చేశాడని ఒప్పుకోవడంతో జయసూర్యకు శిక్ష ఖరారు చేస్తూ.. ఐసీసీ తీర్పు వెలువరించింది. జయసూర్యకు నిజానికి ఐదేళ్లు నిషేధాన్ని విధించాల్సి ఉంది. అంతకు ముందు జయసూర్య సత్ప్రవర్తన కారణంగా నిషేధాన్ని రెండేళ్లకే పరిమితం చేసినట్లు మార్షల్‌ తెలిపాడు. నిషేధం 2018 అక్టోబర్‌ 16నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. లెఫ్ట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్‌, స్పిన్నర్‌ జయసూర్య 1996లో శ్రీలంక ప్రపంచకప్‌ గె లిచిన జట్టులో కీలక సభ్యుడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీగా అవార్డును అందుకున్నాడు. 2012లో క్రికెట్‌ క్రీడనుంచి రిటైర్మెంట్‌ అయిన తర్వాత జయ సూర్య రెండు పర్యాయాలు ఆదేశ క్రికెట్‌ సెలెక్షన్‌ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశాడు.

No comments:

Post a Comment