Wednesday, February 27, 2019

పట్టణంలో ఆసుపత్రుల పోటీ…


కడప న్యూస్‌టుడే:
  • సమాచారానికి 500,ఫోన్ చేస్తే 1000
  •   దీని ద్వారా పట్టణంలో పోటీతత్వం.
ప్రైవేటు అంబులెన్స్‌కు సమాచారమిస్తే రూ.500,ప్రైవేటు ఆసుపత్రులకు ఫోన్ చేస్తే రూ.1000 నుంచి 1,500 అని పట్టణంలోని కొన్ని ప్రైవేటు యాజమాన్యం వారు ప్రకటించారు.వీటికి ఆశ పడిన కొందరు జిల్లా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కేసులు రాగానే వారు సమాచారమిస్తున్నారు.ఫోన్లు చేయడంలో ఒక్కోసారి వారి మధ్య పోటీ మరి తీవ్రంగా ఉంటుంది.ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కొందరిని డబ్బుకోసం ప్రైవేటు  ఆసుపత్రికి తరలిస్తున్నారు.ఈ క్రమంలో రాజుపాలెం మండలంలోని వెలుపలి గ్రామానికి చెందిన అల్లామి అనే బేల్దారి బైకులో వస్తుండగా మార్గం మధ్యలో మరో బైకు ఢీకోట్టడం వలన ప్రమాదం జరిగింది.గాయపడిన  వారిని 108 లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కానీ మార్గం మధ్యలో ఈ డబ్బుకోసం ఎదురుచూసే వారు మరలా వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.దీంతో ఇటీవల కొన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ కేసులు బాగా తగ్గిపోయాయి.దీనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

No comments:

Post a Comment